వికారాబాద్ జిల్లా రోడ్డు ప్రమాద సంఘటన పై ఎంపీ దిగ్బ్రాంతి

వికారాబాద్,తీస్మార్ న్యూస్:వికారాబాద్ జిల్లా మోమిని పెట్ మండలం ఇజ్రా చిట్టెం పల్లి తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన పై చేవెళ్ల ఎం.పి డాక్టర్ రంజిత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సంఘటన విషయం తెలిసిన వెంటనే వికారాబాద్ ఎమ్మెల్యే డా,,మెతుకు ఆనంద్, జిల్లా కలెక్టర్ పౌసమి బసు, ఏ ఎస్పీ రషీద్ గార్ల తో ఫోన్ లో మాట్లాడి ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఎం.పి రంజిత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.