సుపారీ హత్య

వికారాబాద్‌ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి పేగు బంధాన్ని మరిచి కర్కశంగా ప్రవర్తించింది. తాగొచ్చి ఇబ్బంది పెడుతున్నాడని కన్న కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించింది. ఈ సంఘటన వికారాబాద్‌లో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. వికారాబాద్, కోహ్లీ ప్రాంతానికి చెందిన శివప్రసాద్‌ అనే మైనర్‌ బాలుడు తాగొచ్చి ప్రతి రోజు తల్లిని వేధింపులకు గురిచేస్తున్నాడు. కుమారుడి వేధింపులు తట్టుకోలేకపోయిన తల్లి అతడ్ని చంపాలని నిశ్చయించుకుంది. సోదరుడితో కలిసి కుమారుడి హత్యకు పథకం రచించింది. ఇందుకోసం సోదరుడికే సుపారీ ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం శివ ప్రసాద్‌ మేనమామ అతడి గొంతుకు టవల్‌ బిగించి చంపేశాడు. అనంతరం శవాన్ని నీళ్లులేని బావిలో పూడ్చిపెట్టాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బావిలో శివ ప్రసాద్‌ మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తులో మృతుడి తల్లి,మేనమామల విషయం వెలుగుచూసింది. దీంతో వికారాబాద్‌ పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్‌ చేశారు.

 

 

Content Source from:Sakshi.com