మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ అరెస్ట్‌

ఘాజిపూర్‌ ఎన్‌కౌంటర్‌ అనంతరం మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ నదీమ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డిప్యూటి కమిషనర్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం గాజిపూర్‌ ముర్గా సమీపంలో నదీమ్‌ను అదుపులోకి తీసుకుంది. అయితే పోలీసులను చూసి నదీమ్‌ కాల్పులకు తెగబడటంతో ఇరువర్గాల మధ్య కాల్పుల కలకలం రేగింది.

ఈ ఏడాది జులైలో సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) పై కూడా ఆయన కాల్పులు జరిపి నదీమ్‌ పరారైనట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు కూడా హత్యాయత్నం సహా పలు క్రిమినల్‌ కేసుల్లో నదీమ్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు.