దేశ రాజధాని ఢిల్లీలో మోడల్‌పై ఆత్యాచారం

దేశ రాజధాని ఢిల్లీలో ఓ మోడల్‌పై జరిగిన ఆత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఆత్యాచార ఘటన బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో నివాసం ఉండే ఓ మహిళ(మోడల్‌)కు ముంబైకి చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను తన కుటుంబం సభ్యులతో కలిసి ఢిల్లీలోని ఓ వివాహ వేడుకకు హాజరవుతానని ఆమెకు ఫోన్‌లో సందేశం పంపాడు. అతను తన కుటుంబాన్ని ఢిల్లీలోని ఓ హోటల్‌లో‌ దింపాడు. అనంతరం ఆ యువతిని తన స్నేహితుడి ఇంటి వద్ద కలుద్దామని ఫోన్‌లో సందేశాల ద్వారా కోరాడు. దానికి ఆమె నిరాకరించింది.

దీంతో నిందితుడు తాను ఖాన్ మార్కెట్‌ ప్రాంతంలో ఉన్నానని కలవమని మరోసారి కోరగా.. ఆమె అక్కడికి వెళ్లింది ఇద్దరు కలిసి టిఫిన్‌ చేశారు. అనంతరం ఆమెకు మాయ మాటలు చెబుతూ అతడు చాణక్యపురి ప్రాంతంలోని ఉన్న మరో హోటల్‌కు తీసుకువెళ్లాడు. ఆ వ్యక్తి హోటల్‌ గదిలో తనపై ఆత్యాచారానికి ఒడిగట్టాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఆమె వృత్తిరీత్యా మోడల్‌ అని, నిందితుడు దక్షిణ ముంబైకి చెందిన వాడని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఫిబ్రవరి 23న ముంబైకి పంపినట్లు తెలిపారు.