మైనర్‌ బాలికపై అత్యాచారం

మైనర్‌ బాలికపై అత్యాచారం జరిపిన ఓ బ్యాంక్‌ మేనేజర్‌ దాన్ని వీడియో తీసి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మొహాలీకి చెందిన ఓ మైనర్‌కు స్నేహితురాలి ద్వారా 53 ఏళ్ల ఓ బ్యాంక్‌ మేనేజర్‌తో పరిచయమైంది. అతడు మైనర్‌ను అప్పుడప్పుడు షాపింగ్‌ తీసుకెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు హోటల్‌ గదికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. సంఘటనంతా వీడియో తీశాడు.

ఆ తర్వాత నుంచి వీడియో చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేసేవాడు. దీంతో విసుగుచెందిన మైనర్‌ పోలీసులను ఆశ్రయించింది. బ్యాంక్‌ మేనేజర్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మైనర్‌ తన స్నేహితురాలిపై కూడా కేసు పెట్టడంతో ఆమెపై కూడా కేసు నమోదు చేశారు.