యువకుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుండగులు

హైదరాబాద్‌ :  బాలాపూర్‌లోని సుల్తాన్‌పూర్‌ శివారు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇవాళ ఉదయం ఓ యువకుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పరారయ్యారు. శరీరానికి మంటలు అంటుకోవడంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని జిల్లెలగూడకు చెందిన హరీశ్‌ (28)గా పోలీసులు గుర్తించారు. చికిత్సనిమిత్తం అతడిని హుటాహుటిన ఉస్మానియా దవాఖానకు తరలించారు. పాతకక్షల నేపథ్యంలో హరీశ్‌పై హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.