రంగారెడ్డి,తీస్మార్ న్యూస్: శంషాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మృగాడు బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఆ యువకుడు బ్లాక్‌మెయిల్ చేస్తూ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేశాడు. తన దగ్గర తుపాకీ ఉందని బాలిక మీ తల్లిదండ్రులను కాల్చేస్తానంటూ బెదిరించాడు. అయితే బాలిక అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆమె అత్యాచారానికి గురైనట్లు తేలింది. ఈ క్రమంలో బాధితురాలి తల్లిదండ్రులు శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.