సెక్స్ కోరికలు తీర్చుకోవడం కోసం పెళ్లిళ్లు తర్వాత…

సెక్స్ కోరికలు తీర్చుకోవడం కోసం ఓ ప్రబద్ధుడు అమాయకమైన అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. పెళ్లి చేసుకోవడం.. కోరిక తీర్చుకోవడం.. ఆ తర్వాత వదిలేయడం. ఇదే ఆనవాయితీగా పెట్టుకున్నాడు. అలా ఇప్పటివరకు 11 పెళ్లిళ్లు చేసుకున్న ఆ వ్యక్తి పాపం పండింది. ఆనవాయితీ ప్రకారం చేసుకున్న మరో పెళ్లి అతడ్ని పోలీసులకు పట్టించింది.చెన్నైకి చెందిన గణేష్ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమలోకి దింపాడు. ఆమెను తీసుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, మేజర్లు కావడంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు.అలా అమ్మాయితో కాపురం పెట్టిన గణేష్, కొన్నాళ్లకు పనిమనిషితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తన భార్యను గదిలో పెట్టి తాళం వేసి, పనిమనిషితో మరో గదిలో శృంగారం చేసేవాడు. దీంతో ఇంటి ఓనర్ సహకారంతో తప్పించుకున్న అమ్మాయి, తన తల్లిదండ్రుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.రంగంలోకి దిగిన పోలీసులు గణేష్ ను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించగా.. కళ్లుచెదిరే వాస్తవాలు బయటపడ్డాయి. తను కేవలం సెక్స్ కోసం మాత్రమే పెళ్లిళ్లు చేసుకుంటానని, అలా ఇప్పటివరకు 11 మందిని పెళ్లి చేసుకున్నానని గణేష్ చెప్పడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయింది.ప్రస్తుతం గణేష్ ను పోలీసులు జైళ్లో పెట్టారు. అతడ్ని పెళ్లాడిన మహిళలంతా వచ్చి ఫిర్యాదు చేయాలని, వాళ్ల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెబుతున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. ఈ గణేష్ అనే వ్యక్తి వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే.