కట్టుకున్న భార్యని హింసించిన భర్త

ఉత్తర ప్రదేశ్​లో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యనే, ఇంట్లో నిర్భందించి లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మహరాష్ట్రలోని పండర్​పుర్​ నగరానికి చెందిన సదరు వ్యక్తి తన భార్యను , ముగ్గురు కూతుళ్లను ఒకటిన్నర సంవత్సరాలుగా ఇంట్లోనే బంధించాడు. ఇంతటితో ఆగకుండా తన భార్యపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఆమెపై ఎన్నోసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ క్రమంలో, భర్త ప్రవర్తన పట్ల విసిగెత్తిపోయిన ఆమహిళ స్థానిక పోలీసు అధికారులకు ఎస్​వోఎస్​ మెస్సెజ్​ చేసి, తన గొడును చెప్పుకుంది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పండర్​పుర్​ నగరంలోని జెండాగుల్లి ప్రాంతంలోని నిందితుడి ఇంటిపై దాడిచేశారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళను, ముగ్గురు కూతుళ్లను విడిపించారు. అయితే, నిందితుడిపై పలు సెక్షన్​ల కింద కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ మహిళకు కొడుకులు పుట్టక పోవడం వలనే క్రూరంగా ప్రవర్తించాడని తెలిసింది.