లారీ కిందపడి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

హనుమాన్‌ జంక్షన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి లారీ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న లారీ కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతుడిని ప్రముఖ వస్త్ర వ్యాపారి రమేష్‌గా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా లోతుగా దర్యాప్తు చేపట్టారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.