అది గుజరాత్ లోని నవరంగపుర ప్రాంతంలోని బిజీగా ఉన్న రోడ్డు అక్కడ బస్ స్టాప్ దగ్గర ఒక యువతి బస్ కోసం వేచి చూస్తున్నది. కానీ ఆ యువతి మాత్రం అక్కడ ఒక్కతే ఉన్నది. ఆమె లా చదువుతున్నది. ఇంతలో ఆమె దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి ఆ విద్యార్థిని ఒక చిరునామా గురించి ఆరా తీశాడు. దానికి ఆమె సమాధానం చెప్పింది. ఆమె చెప్పడం ఆపిందో లేదో అతడు దారుణానికి ఒడిగట్టాడు. తాను నడిరోడ్డు మీద ఉన్న ఇంగితాన్ని కూడా మరిచి ఆమె ముందు అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంట్లో ఎవరూ లేరు వస్తావా ? అన్నట్టు సైగ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి. గుజరాత్ లోని నవరంగపుర లో చోటు చేసుకుందీ ఘటన. చిరాగ్ భాటి అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఒక బస్ స్టేషన్ దగ్గరికెళ్లి అక్కడున్న యువతితో ఒక అడ్రస్ గురించి చెప్పాలని అడిగాడు.ఆమె అడ్రస్ చెబుతున్న సమయంలోనే అసభ్యంగా ప్రవర్తించాడు. తన ప్యాంటు జిప్పు తీసి అతడి ప్రైవేట్ పార్ట్స్ ఆమెకు చూపించాడు. అంతేగాక చేతులతో అసభ్యకరమైన సైగలు చేస్తూ ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో పక్కనే ఉన్న స్కూటర్ పట్టుకుని అక్కడ్నుంచి పారిపోయాడు నిందితుడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వాళ్లు అక్కడున్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. దాంట్లో అతడి బండి నెంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా అతడు స్పందిస్తూ ‘నా భార్య గర్భవతి. మూడు నెలలుగా నేను సెక్స్ చేయడం లేదు. నేను కోరికలను అణుచుకోలేకపోయాను. అందుకే ఆ సుఖం కోసం యువతి దగ్గరికెళ్లి ప్యాంటు జిప్ తీసి ప్రైవేట్ పార్ట్స్ చూపించాను’ అని నేరం అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని బొక్కలో తోశారు.
