అత్తమామలను హత్య చేసిన మేనల్లుడు

ఆస్తి తగాదాల్లో మేనల్లుడు అత్తమామలను దారుణంగా హత్య చేశాడు. వివరాలు.. జిల్లా కేంద్రం క్రిష్ణగిరి వీరప్పన్‌నగర్‌కు చెందిన పుగళేంది(55), భార్య పప్పిరాణి (45). పుగళేందికి అన్న ఇళంగోవన్‌తో ఆస్తి గొడవలున్నాయి. ఇళంగోవన్‌ కొడుకు లోకేష్‌ (18) హోసూరులో డిగ్రీ రెండవ ఏడాది విద్యార్థి. గురువారం ఉదయం మిత్రుడు సతీష్‌(18)తో కలిసి అత్త ఇంటికి వెళ్లి వేటకొడవలితో దాడి చేశారు.

ఈ దాడిలో భార్యాభర్తలిరువురూ తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచారు. క్రిష్ణగిరి పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాలను స్వాధీనపరుచుకొన్నారు. కేసు నమోదు చేసుకొని లోకేష్, సతీష్‌లను అరెస్టు చేశారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో తీవ్ర సంచలనం నెలకొంది.