చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి

మహబూబాబాద్: జిల్లాలోని గూడూరులో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని అప్పరాజుపల్లిలో ఓ గీత కార్మికుడు తాటిచెట్టు పైనుంచి కిందపడి మరణించాడు. గ్రామానికి చెందిన మన్నే మల్లేష్‌ కులవృత్తిలో భాగంగా కల్లు గీస్తున్నాడు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం తాటి చెట్టుపైన కల్లు గీస్తుండగా.. మోకు జారడంతో చెట్టుపైనుంచి కింద పడిపోయాడు. బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మరణించారు. సమీపంలోనివారు గమనించి అక్కడికి వచ్చేలోపే విగతజీవిగా పడిఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.