పాతబస్తీలో దారుణం

పాతబస్తీలోని డబీర్​పురాలో దారుణం చోటుచేసుకుంది. అద్నాన్​కు, ప్రత్యర్థులైన అజీబ్​, ముజీబ్​, కమ్రాన్​లకు మనస్పర్థలున్నాయి. ఈ క్రమంలో ఆ ముగ్గురు కలిసి అద్నాన్​ను తీవ్రంగా కోట్టారు. ఈ క్రమంలో అద్నాన్​ అపస్మారక స్థితిలోనికి చేరుకున్నాడు.

వెంటనే కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్సకోసం ఓక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అయితే, అద్నాన్​ చికిత్స పోందుతు మృతి చెందాడు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.