ములుగు జిల్లాలోని ఏటూరునాగారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న టిప్పర్.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడిని కన్నాయిగూడెం మండలం గుట్టల గంగారం గ్రామానికి చెందిన కోరం శంకరయ్యగా పోలీసులు గుర్తించారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
