జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

ఒంటరి జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శంకర్‌పల్లి పోలీస్టేషన్‌ పరిధిలో బుధవారం వెలుగులోకి వచి్చంది. పోలీసులు తెలిపిన వివరాలు… ఒంగోలు జిల్లా టంగులూరు గ్రామానికి చెందిన మేదర్‌గాందీ(48) నాలుగు సంవత్సరాల కిత్రం శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూరం గ్రామానికి కుటుంబంతో సహా వచ్చి బతుకుదెరువు నిమిత్తం వచ్చి కుటుంబంతో కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. సంవత్సరం కిత్రం మేదర్‌గాంధీ భార్య అతనితో విడిపోయి విడాకులు తీసుకుంది.

అప్పటినుంచి అతడు మానసికంగా కుంగిపోయాడు. ఒంటరిగా ఉంటూ తీవ్ర మనస్థాపానికి గురైన మేదర్‌గాంధీ శంకర్‌పల్లిలోని వైష్ణవి హోండా షోరూంలో ఖాళీగా ఉండే మూడవ అంతస్తులో ఉరివేసుకున్నాడు. రెండు రోజుల అనంతరం అందులో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో ఆత్మహత్య చేసుకున్న విషయం బయటపడింది. మృతుడి వద్ద లభించిన ఐడీ కార్డుల ఆధారంగా అతని వివారలను పోలీసులు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.