పోలీసుల కళ్లముందే ఆత్మహత్యాయత్నం

వరంగల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బాటిల్‌తో స్టేషన్‌లోకి వచ్చిన వ్యక్తి అమాంతం పెట్రోల్ పైన పోసుకుని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. కంగుతన్ని పోలీసులు వెంటనే తేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. మధ్యాహ్నం సమయంలో అబ్బానీకుంటకు చెందిన హరికృష్ణ పెట్రోల్ బాటిల్‌తో పోలీస్ స్టేషన్‌‌లో హల్‌చల్ చేశాడు. అమాంతం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

పోలీసుల కళ్లముందే ఆత్మహత్యాయత్నం చేశాడు. మంటలు వ్యాపించడంతో గిలగిలా కొట్టుకుంటూ అక్కడే కుప్పకూలిపోయాడు. హఠాత్పరిణామంతో షాక్‌కి గురైన పోలీసులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.