నగ్న ఫోటోలతో బ్లాక్‌మెయిల్‌..

ఢిల్లీ : ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు 100 మంది మహిళలను బ్లాక్‌బెయిల్‌ చేసి డబ్బులు దండుకున్న పోకిరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీకి చెందిన సుమిత్‌ ఝా(26) అనే వ్యక్తి నకిలీ న్యూడ్‌ పిక్చర్స్‌ను ఉపయోగించి 100 మంది మహిళలను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే మీ ప్రైవేట్‌ పార్ట్స్‌ను సోషల్‌ మీడియాలో సర్క్యూలేట్‌ చేస్తానని బెదిరింపులకు పాల్పడేవాడు. ఇదేవిధమైన కేసులో సుమిత్‌ ఝా ఛత్తీస్‌గఢ్‌లో ఓసారి అరెస్టు అయ్యాడు. బెదిరింపులకు పాల్పడటం, లైంగిక వేధింపులకు గురిచేయడం, నేరపూరిత చర్యలకు పాల్పడటం వంటి సెక్షన్ల కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఫోటోలు సేకరించి తన డిమాండ్‌ మేరకు డబ్బులు ఇవ్వకపోతే ప్రైవేటు పార్ట్స్‌ను సోషల్‌ మీడియాలో సర్యూలేట్‌ చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు బాధిత మహిళ వెల్లడించింది. అంతేకాకుండా తన కాంటాక్ట్‌ లిస్ట్‌లోని వారిని సైతం డబ్బులు డిమాండ్‌ చేసినట్లుగా సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఇంటర్‌నెట్‌ కాలింగ్‌ సౌకర్యంతో మోసాలకు పాల్పడుతున్న సుమిత్‌ ఝాపై ఢిల్లీ సైబర్‌ సెల్‌ పూర్తిస్థాయి విచారణను చేపట్టి నిందితుడిని గుర్తించి అరెస్టు చేసింది. సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి మహిళల ఫోటోలు సేకరించి వాటిని మార్ఫింగ్‌కు గురిచేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు.