ప్రేమ జంట ఆత్మహత్య

జిల్లాలోని నందిపేట్‌ మండలంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపుతోంది. కుద్వాస్‌పూర్‌ గ్రామానికి చెందిన సుకన్య సోమవారం తెల్లవారుజామున గ్రామంలోని తన ఇంటి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ప్రియురాలి మరణ వార్త తెలిసిన వెంటనే ఐలపూర్‌ గ్రామానికి చెందిన ప్రియుడు ప్రేమ్‌కుమార్‌ తీవ్రమైన మనస్థాపానికి గురై గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ప్రేమ జంట ఆత్మహత్యలపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.