జగిత్యాల జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

జగిత్యాల జిల్లాలోని హైదర్ పల్లిలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడి వారానికిపైగా కావడంతో శవాలు కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నాయి. యువకుడిని నలువాల మధుగా పోలీసులు గుర్తించారు. మధుతోపాటు బలవన్మరణానికి పాల్పడిన యువతిని గుర్తించాల్సి ఉంది.

మధు తల్లిదండ్రులు 20 ఏళ్ల క్రితం మృతి చెందడంతో జగిత్యాలలో ఓ ఫాస్ట్ పుడ్ సెంటర్ లో పనిచేస్తూ తన పాత ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు.‌ నా అనే వారు ఎవరూ లేకపోవడంతో ఒంటరి జీవితం గడుపుతున్న మధు మరో అమ్మాయితో ఉరి వేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. అమ్మాయి ఎవరు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.