ఉత్తర్‌‌ ప్రదేశ్‌లో ఘొరం

మహబూబాబాద్,తీస్మార్ న్యూస్:జిల్లాలో విషాదం చోటుచేసుకుంది పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని గార్ల మండలం రాజుతండ పరిధిలో ఉన్న వడ్ల తండ శివార్లలో ఉన్న ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను గుగులోత్‌ ప్రశాంత్‌, భూక్య ప్రవీణగా గుర్తించారు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారం వ్యవధిలో మూడు ప్రేమజంటలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.