ప్రేమ జంట ఆత్మహత్య

ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఓ జంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మనగాల మండలం మొద్దుల చెరువు గ్రామంలో చోటుచేకుంది. చివ్వెంల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు నవీన్‌(21), కేశబోయిన మహేశ్వరి(18) గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరివురు పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయాన్ని పెద్దలకు చెప్పడంతో వారు అంగీకరించలేదు.

దీంతో మనస్థాపానికి గురైన వారు గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చి మొద్దుల చెరువు గ్రామ శివార్లలో వేప చెట్టుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయాన్నే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.