హైదరాబాద్ : నగరంలోని బేగంపేట ఫ్లై ఓవర్ వద్ద సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఫ్లై ఓవర్ రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో లారీ ముందు భాగం దెబ్బతిన్నది. లారీ రోడ్డుపై ఉండటంతో ఆ దారిలో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ప్రమాదస్థలికి ట్రాఫిక్ పోలీసులు చేరుకుని క్రేన్ సహాయంతో లారీని పక్కకు తీశారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.