మూసాపేటలో విషాదం

మూసాపేటలో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొనగా, తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకెళ్తే.. బతుకుదెరువు కోసం శ్రీకాకుళం నుంచి హైదర్‌బాద్‌కు వచ్చిన వెంకట్రావ్‌ కుటుంబం (భార్య, ఇద్దరు పిల్లలు) మూసాపేటలో నివాసం ఉంటున్నారు. రోజూలానే తల్లిదండ్రులద్దరు పనులకు వెళ్లడంతో చిన్నకుమారుడైన నవీన్‌ (8) మిత్రులతో కలసి సరదాగా ఈత కొట్టడానికి వెళ్లాడు.

ఈత కొడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటి గుంతలో మునిగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి కుమారుడిని రక్షించుకోవడానికి విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నోట్లో నోరుపెట్టి కృత్రిమ శ్వాసను అందించినా ప్రయత్నం​ ఫలించలేదు. అ‍యితే వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.