చంటిబిడ్డ కిడ్నాప్

జిల్లాలో చంటిబిడ్డ కిడ్నాప్‌ కలకలం రేపింది. ఓ తల్లి చేతుల్లోంచి పసిబిడ్డను లాక్కెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ సంఘటన బుధవారం ధర్మవరంలో చోటుచేసుకుంది. వివరాలు.. ధర్మవరానికి చెందిన ఓ మహిళ తన ఐదు మాసాల పాపకు టీకా వేయించేందుకు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు వచ్చింది.

ఆసుపత్రి సమీపంలో కొందరు దుండగులు ఆమె చేతుల్లోంచి పాపను బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో అక్కడివారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దుండగులను వెంబడించగా రైల్వేస్టేషన్‌ వద్ద పాపను వదిలిపెట్టి పారిపోయారు. పోలీసులు పాపను తల్లికి అప్పగించారు. కుటుంబ కలహాలే కిడ్నాప్‌కు కారణమన్న కోణంలో విచారణ చేపట్టారు.