లాయర్‌ సూసైడ్‌ నోట్‌

భార్య దూరమయ్యింది. పదేళ్ల బిడ్డతో ఒంటరిగా ఉంటున్నాడు. బాధితులకు న్యాయం చెప్పాల్సిన లాయర్‌ అయ్యుండి.. క్షణికావేశంలో ఓ తప్పు చేశాడు. ఆ తర్వాత తనను తాను క్షమించుకోలేక ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్నాడు. పదేళ్ల బిడ్డను ఒంటిరి చేసి వెళ్లాడు. ఈ విషాద సంఘటన మధురైలో చోటు చేసుకుంది. సదరు లాయర్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ కనిపించకుండా పోయిన ఓ యోగా టీచర్‌కు సంబంధించిన వివరాలు వెలుగులోకి తెచ్చింది.

ఆ వివరాలు.. లాయర్‌గా పని చేస్తున్న హరిక్రిష్ణన్‌ అనే వ్యక్తి తన పదేళ్ల కుమార్తెతో కలిసి మదురైలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమలో మంగళవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. హరిక్రిష్ణన్‌ ఇంట్లో లభించిన సూసైడ్‌ నోట్‌ మరో మిస్సింగ్‌ కేసు పరిష్కరించడానికి సాయం చేసింది.