ట్రాక్ట‌ర్ బోల్తా…పలువురు కూలీలకు గాయాలు

ములుగు : కూలీల‌తో వెళ్తున్న ట్రాక్ట‌ర్ బోల్తాప‌డిన దుర్ఘ‌ట‌న‌లో ప‌లువురు కూలీలు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న ములుగు జిల్లా వాజేడు మండ‌లంలోని భీర‌మ‌య్య వ‌ద్ద ఉన్న లోట‌పిట గండి వ‌ద్ద చోటుచేసుకుంది. బాధితుల‌ను చికిత్స నిమిత్తం పేరూరు ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి త‌ర‌లించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన‌వారిని మెరుగైన వైద్యం కోసం వ‌రంగ‌ల్ ఎంజీఎంకు త‌ర‌లించారు.