నవ వధువు ఆత్మహత్య

కొత్తగూడెం: చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో చోటు చేసుకుంది. యువతిపై ఆమె అన్నతో పాటు, పెద్దమ్మ కుమారుడు అజయ్‌ కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బాధితురాలు కొత్తగూడెం రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదుతో భయాందోళనకు గురైన అజయ్‌ ఈరోజు ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఏం జరిగిందంటే?..
ఇన్‌స్పెక్టర్‌ బత్తుల సత్యనారాయణ కథనం ప్రకారం.. బాధిత యువతి చిన్నతనంలోనే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. కుటుంబ బాధ్యతలన్నీ తల్లి చూసేది. ఆమె చిన్నతనంలో వీరి కుటుంబం మణుగూరులో ఉండేది. ఆమె 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచే (2009) సొంత అన్నయ్య ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. కొన్నేళ్ల క్రితం అతడికి ఉద్యోగం రావటంతో కొత్తగూడేనికి వచ్చారు. ఆమె పెద్దదైనా అతడు అలాగే వ్యవహరిస్తున్నాడు. అతడి హింసలు భరించలేక ఇంటర్‌ చదివే సమయంలో కొత్తగూడెంలోనే ఉన్న పెద్దమ్మ ఇంటికి వెళితే అక్కడ వరసకు అన్నయ్య అయిన వాళ్ల కుమారుడు ఆమెపై లెంగికదాడికి దిగాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. తల్లి, పెద్దమ్మ, పెదనాన్నలకు చెప్పినా పట్టించుకోకపోగా నీచంగా మాట్లాడేవాళ్లు. మెడిసిన్‌ ఎంట్రన్స్‌ శిక్షణ నిమిత్తం ఇటీవల వేరే ప్రాంతానికి వెళ్లినా లాక్‌డౌన్‌ సమయంలో మళ్లీ ఇంటికి చేరక తప్పలేదు. అప్పుడూ అన్నయ్య అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో కొన్ని రోజుల వరకు వారికి దూరంగా ఉన్నా మళ్లీ సెలవులు ఇవ్వడంతో తిరిగి కొత్తగూడేనికి వచ్చిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు అన్నయ్యలతోపాటు తల్లి, పెద్దమ్మ, పెద్దనాన్న నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది.