క్షణికావేశంలో భార్యను హత్య చేసిన భర్త

హైదరాబాద్‌ : నగరంలోని రాజేందర్‌నగర్‌ హైదర్‌గూడలో దారుణం చోటు చేసుకుంది. క్షణికావేశంలో కట్టుకున్న భార్య సమత (26)ను భర్త రవి హత్య చేశాడు. ఈ విషాద ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మద్యం సేవించొద్దని చెప్పడంతో అర్ధరాత్రి వాగ్వాదానికి దిగి, హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.