గర్భిణి భార్యపై కత్తితో దాడి చేసిన కసాయి భర్త

గర్భిణి అని చూడకుండా కత్తితో తన భార్యపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన విశాఖపట్టణం జిల్లాలో చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. కత్తితో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమైంది. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అనకాపల్లి ప్రాంతానికి చెందిన రమేశ్‌, సంతోషి యశోద భార్యాభర్తలు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలో గ్రామ పెద్దల వద్ద పంచాయితీ కూడా నడిచింది. అయితే పెద్దల సమక్షంలో తనతో రానని భార్య తెగేసి చెప్పి కుంచంగిలోని తన తల్లి ఇంటికి వెళ్లింది. దీంతో రమేశ్‌ తట్టుకోలేకపోయాడు. కోపంతో కుంచంగిలో ఉన్నఅత్తవారింటికి వెళ్లి సంతోషి యశోదపై కత్తితో దాడి చేశాడు. ఆమె తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబసభ్యులు, స్థానికులు సంతోషిని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.