కదులుతున్న బస్సులో అమ్మాయిపై క్లీనర్ అత్యాచారం

ముంబయి: కదులుతున్న బస్సులో ఓ అమ్మాయి(21)పై క్లీనర్ అత్యాచారం చేసిన సంఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోండా జిల్లాకు చెందిన అమ్మాయి పుణే ప్రాంతం రంజన్‌గడ్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తోంది. తన చెల్లి పెళ్లి ఉండడంతో పుణే నుంచి నాగ్‌పూర్ వచ్చింది. పెళ్లి వేడుకలు ముగిసిన తరువాత జనవరి 6న గొండా జిల్లా నుంచి ఓ బస్సులో పుణే వెళ్తుండగా బస్సు క్లీనర్ సమీర్ దేకర్(25) కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు.పుణే వచ్చిన తరువాత తన స్నేహితురాలుతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.