గుండెపోటుతో గురుకుల ఉపాధ్యాయుడు మృతి

హైద‌రాబాద్ : ఘ‌ట్‌కేస‌ర్ ప‌రిధిలోని రాంప‌ల్లి ఆర్ఎల్ న‌గ‌ర్‌లో విషాదం నెల‌కొంది. ఇటీవ‌లే కిడ్నాప్ డ్రామా ఆడిన బీ ఫార్మ‌సీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. స‌ద‌రు యువ‌తి సోమ‌వారం రాత్రి నిద్ర మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ‌త‌న‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారంటూ యువ‌తి క‌ట్టుక‌థ సృష్టించిన‌ట్లు రాచ‌కొండ పోలీసులు తేల్చిన విష‌యం తెలిసిందే. మృతురాలి కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కుటుంబ స‌భ్యులు, బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. విద్యార్థిని బీ ఫార్మ‌సీ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతోంది. తనకు కుటుం‌బ‌స‌భ్యు‌లతో ఉండటం ఇష్టం లేక ఇంటి నుంచి వెళ్లి పోదా‌మ‌ను‌కొని కిడ్నాప్‌ డ్రామా సృష్టిం‌చింది.

అస‌లేం జ‌రిగింది?

ఫిబ్ర‌వ‌రి 10వ తేదీన తాను కిడ్నాప్‌కు గురయ్యాయ‌నని, అత్యాచారం చేశార‌ని బీఫా‌ర్మసీ విద్యా‌ర్థిని మొద‌ట త‌ల్లికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన త‌ల్లి 100కు డ‌య‌ల్ చేయ‌డంతో పోలీసులు టెక్నాల‌జీ స‌హాయంతో యువ‌తి ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆమెను చేర‌దీసి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఈ కేసును రెండు రోజుల పాటు సీసీ‌టీవీ ఫుటే‌జీ‌లను పరి‌శీ‌లిస్తూ చేప‌ట్టిన దర్యా‌ప్తులో కిడ్నాప్‌, రేప్‌ ఉట్టి‌దే‌నని తేలింది.

ద‌ర్యాప్తు ఇలా..

పోలీ‌సుల‌ దర్యా‌ప్తులో భాగంగా రాంపల్లి చౌరస్తా నుంచి అన్నో‌జి‌గూడ వరకు ఆటోలు నడి‌పే‌వా‌రం‌ద‌రినీ అదు‌పు‌లోకి తీసు‌కు‌న్నారు. విద్యా‌ర్థిని చెప్పిన ఆన‌వా‌ళ్లతో కూడిన కొంత మంది డ్రైవ‌ర్లను విచా‌రిం‌చారు. ప్రధాన అను‌మా‌ని‌తుడు తిరి‌గిన ప్రాంతాల సీసీ‌టీవీ ఫుటే‌జీ‌లను పరి‌శీ‌లిం‌చారు. యువతి చెప్పి సమ‌యా‌నికి ఆ అను‌మా‌ని‌తుడు ఓ మల్టి‌ప్లె‌క్స్‌కు వెళ్లి‌నట్టు, ఆ తర్వాత స్నేహి‌తు‌డితో బార్‌ అండ్‌ రెస్టా‌రెం‌ట్‌కు వెళ్లి‌నట్లు తేలింది. ఇలా దాదాపు 100 సీసీ కెమె‌రాల ఫుటే‌జీ‌లను చూసి క్రైం సీన్‌ రీ కన‌స్ర్ట‌క్షన్‌ చేశారు. అప్పుడు విద్యా‌ర్థి‌నిని ఎవరూ కిడ్నాప్‌ చేయ‌లే‌దని, ఆమెను నడు‌చు‌కుంటూ తిరి‌గిం‌దని గుర్తిం‌చారు.

మినిట్ టూ మినిట్‌

10వ తేదీన సాయంత్రం 5.30 గంట‌లకు విద్యా‌ర్థిని రాంప‌ల్లికి కాలేజీ బస్సులో చేరు‌కు‌న్నది.

5.44 గంట‌లకు రాంపల్లి చౌరస్తా నుంచి యంనం‌పే‌ట్‌కు 7 సీటర్‌ ఆటో ఎక్కింది.

5.57: యంనం‌పేట్‌ టీ స్టాల్‌ వద్ద ఆటో దిగింది.

5.58: విద్యా‌ర్థి‌నిని దించిన ఆటో యంనం‌పేట్‌ బ్రిడ్జి వద్ద యూటర్న్‌ తీసు‌కు‌న్నది.

6.03: విద్యా‌ర్థిని యంనం‌పే‌ట్‌లో నడు‌చు‌కుంటూ వెళ్తూ తన తల్లికి ఫోన్‌‌చే‌సింది.

6.15: ఘట్‌‌కే‌సర్‌ శ్రీనిధి కాలేజీ వద్ద నడు‌చు‌కుంటూ కని‌పిం‌చింది.

6.44: 4 కిలో‌మీ‌టర్లు నడుచుకుంటూ ఘట్‌‌కే‌సర్‌ రైల్వే‌స్టే‌షన్‌ పరి‌స‌రాల్లో తిరి‌గింది.

6.48: ఘట్‌‌కే‌స‌ర్‌లో నడు‌చు‌కుంటూ తిరి‌గింది.

6.58: ఘట్‌‌కే‌స‌ర్‌లో హాస్టల్‌ దగ్గర నుంచి నడు‌చు‌కుంటూ ముందుకు వెళ్లింది.

6.59: ఘట్‌‌కే‌సర్‌ పాత గ్రామా‌నికి చేరు‌కు‌న్నది.

రాత్రి 7.05 గంట‌లకు కల్కి దవా‌ఖాన వద్ద ఆటో ఎక్కి అన్నో‌జి‌గూడ వైపు వచ్చింది.

7.23 గంట‌లకు పోలీ‌సు‌లకు రోడ్డుపై పడు‌కొని కని‌పిం‌చిన ప్రదే‌శా‌నికి 150 మీటర్ల దూరంలో నడు‌చు‌కుంటూ కని‌పిం‌చింది.

ఈ చివరి దృశ్యంతో విద్యా‌ర్థిని కిడ్నాప్‌ కాలే‌దని నిర్ధా‌రిం‌చు‌కొని రెండో‌సారి పోలీ‌సులు ఆమెను ప్రశ్నిం‌చారు. అప్పుడు కిడ్నాప్‌, లైంగి‌క‌దాడి జరు‌గ‌లే‌దని స్పష్టం‌చే‌సింది. అంత‌కు‌ముందు కుమార్తె నుంచి 6.03కు ఫోన్‌ వచ్చిన తర్వాత ఆమె తల్లి తీవ్ర కల‌వ‌రా‌నికి గురైంది. ఈ విష‌యాన్ని తన బంధు‌వు‌లకు చెప్ప‌డంతో వారు 6.29కు డయల్‌ 100కు ఫోన్‌‌చే‌శారు. 72 గంట‌ల‌పాటు విచా‌రిం‌చిన పోలీ‌సు‌లకు శుక్ర‌వారం సాయంత్రం అసలు విష యం తెలి‌సింది. విద్యా‌ర్థి‌నిపై పోలీ‌సులు కేసు నమో దు చేస్తారా? అనే ప్రశ్నకు లేదని సమా‌ధానం వస్తు‌న్నది. కోర్టు ఆదే‌శాల మేరకు నడు‌చు‌కుం‌టా‌మని పోలీ‌సులు నాడు తెలిపిన విష‌యం తెలిసిందే.