ఘోర రోడ్డు ప్రమాదం

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకెళ్తే.. మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామ శివారులో హైదరాబాద్‌ నుంచి రాయచూర్‌ వెళ్తున్న కారు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మహిళలతో సహా ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదంలో డ్రైవర్‌ తీవ్ర గాయాల పాలవ్వగా.. ఓ చిన్నారి సురక్షితంగా బయటపడింది. ప్రమాదవార్త తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని మక్తల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.