భారీ అగ్ని ప్రమాదం

అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూణేలోని సీరం సంస్థ మాంజ్రీ ప్లాంట్‌లోని టెర్మినల్-1 గేట్ వద్ద మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సిబ్బంది మృతిచెందగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు.

అగ్రి ప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంపై సీరం ఇన్‌స్టిట్యూట్ బృందం విచారణ జరుపుతోంది. కాగా ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రా జెనెకా అభివృద్ధి చేసిన ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను సీరం భారీ ఎత్తున తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కోవీషీల్డ్‌ టీకాలు తయారీకి ఎలాంటి ఆటంకంలేదని సీరం సిబ్బంది తెలిపింది.