వనస్థలిపురంలో అగ్నిప్రమాదం

వనస్థలిపురంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎఫ్‌సీఐ కాలనీలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఒక మహిళ సజీవ దహనం అయ్యింది.

ఇంటి యజమాని బాలకృష్ణతో పాటు ఇద్దరు పిల్లలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. బాలకృష్ణను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.