కుటుంబ ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని చామరాజనగర తాలూకా హెచ్‌.మూకహళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మహదేవస్వామి (45), భార్య మంగళమ్మ (40), పిల్లలు జ్యోతి (14), శృతి (12) ఉరి వేసుకుని మరణించారు. వీరికి ఒక ఎకరా పొలం ఉంది. తరచూ నష్టాలే వచ్చాయి. అలాగే అప్పులు పెరిగిపోయాయి. కరోనా సమయంలో కూలి పనులు కూడా దొరకక తీవ్ర అవస్థలు పడ్డారు.

20 రోజుల క్రితం నలుగురికీ కరోనా సోకి, ఇటీవలే కోలుకున్నారు. జీవితంలో కష్టాలు తీరే మార్గం లేదని ఆవేదన చెంది మంగళవారం రాత్రి భోజనం చేశాక అందరూ ఉరివేసుకున్నారు. బుధవారం ఉదయం ఎంతసేపైనా అలికిడి లేకపోవడంతో ఇరుగుపొరుగు వచ్చి చూడగా మృతదేహాలు కనిపించాయి. మొదట పిల్లలకు ఉరివేసి, తరువాత పెద్దవారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.