కానిస్టేబుల్‌ ఆతహ్మత్య

ఓ కానిస్టేబుల్‌ బ్లేడుతో గొంతుకోసుకుని ఆతహ్మత్యకు పాల్పడిన ఘటన మంగళవారం మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ కేవీ సుబ్బారావు వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం, బాలాజీనగర్‌కు చెందిన బానోత్‌ భిక్షం, రేణుక దంపతులకు అభిలాష్‌ నాయక్‌(33), ప్రభునాయక్‌ ఇద్దరు కుమారులు. భిక్షం ఆటోడ్రైవర్‌. 40 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి మూసారంబాగ్‌ డివిజన్‌ బాలదానమ్మబస్తీలో స్థిరపడ్డారు.

గవర్నమెంట్‌ క్వార్టర్స్‌లో కింది పోర్షన్‌లో అభిలాష్‌ భార్యాభర్తలు, తల్లిదండ్రులు ఉంటుండగా.. రెండో ఫ్లోర్‌లో చిన్నకుమారుడు ప్రభునాయక్‌ ఉంటున్నాడు. అభిలాష్‌ నాయక్‌కు 2014లో కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చింది. భార్య ఇంద్రజ్యోతి, ధీరజ్, హేమంత్‌ ఇద్దరు సంతానం. ఆరేళ్లుగా మాదన్నపేట పీఎస్‌లో విధులు నిర్వహిస్తుండగా.. చిన్నకుమారుడు ప్రభునాయక్‌ జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అభిలాష్‌ తన భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలను శుక్రవారం కోదాడకు తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టి ఇంటికి వచ్చాడు.