మలక్‌ పేట్ లో‌ కారు బీభత్సం

పెద్దపల్లి :  కారు, బైక్‌ ఢీకొని తల్లీకుమారుడు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగపల్లి గ్రామానికి చెందిన దబ్బేట నాగరాజు (23) తల్లి రాజేశ్వరి (50) తో కలిసి బైక్‌పై మంథని  వైపు వెళ్తున్నాడు. బట్టుపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.