పాతబస్తీలో కారు బీభత్సం

పాతబస్తీలో కారు బీభత్సం సృష్టించింది. మిశ్రీగంజ్‌లో ఇంటి ముందు కూర్చోని ఇద్దరు చిన్నారులు ఆడుకుంటుండగా రివర్స్‌లో వారిపైకి కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి రెండు కాళ్లు విరిగిపోయాయి. మరో బాలుడు తృటిలో తప్పించుకున్నాడు. కాగా కారును మహిళ డ్రైవ్‌ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆమె ఇటీవలే యూఏఈ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.