సవతి తల్లిపై అమానుషం

సభ్యసమాజం తలదించుకునే అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వావీవరసలు మరచిన కీచకుడు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. సవతి తల్లిపై అమానుషంగా అత్యాచారం చేశాడు. ఆ విషయం బయటకు చెబితే పరువు పోతుందంటూ బంధువులు బాధితురాలినే అడ్డుకున్నారు. అయినా పట్టువదలని బాధితురాలు ధైర్యంగా దుర్మార్గుడిపై పోలీసు కేసు పెట్టింది. ఈ అత్యంత దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.

భోపాల్‌కి చెందిన వ్యక్తి మొదటి భార్య చనిపోవడంతో మరో మహిళ(24)ను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. కొద్దికాలం కిందట ఆయన మరణించడంతో మొదటి భార్య కొడుకు ఆమెపై కన్నేశాడు. నాలుగు రోజుల కిందట అర్ధరాత్రి వేళ ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. పిల్లలు ఒక గదిలో నిద్రిస్తుండగా మరో గదిలో ఉన్న సవతి తల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

ఆమె కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కి అమానుషంగా అత్యాచారం చేశాడు. వావీవరసలు మరచి పశువులా పైశాచికం ప్రదర్శించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు ధైర్యం చేసి సవతి కొడుకు చేసిన దారుణాన్ని బంధువులకు చెప్పుకుని బాధపడింది. అయితే ఆమెకు అండగా ఉండాల్సిన బంధువులు.. బయటకు తెలిస్తే తన పరువే పోతుందంటూ అడ్డుకున్నారు.

సమాజం తనను అవమానకరంగా చూస్తుందని భయపెట్టారు. అయినా సవతి కొడుకు నీచాన్ని సహించలేని బాధితురాలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించింది. ఆ మృగాడిపై కేసు పెట్టింది. రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు విచారణ కొనసాగుతోంది.