ప్రేమించాడు…పెళ్ళంటే కాదన్నాడు…ప్రియురాలి చేతిలో హతమయ్యాడు

పశ్చిమ గోదావరి:మలకపల్లి గ్రామానికి చెంది పావని(21), తాడేపల్లి గూడెం చెందిన తాతాజీ నాయుడు(25) గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. గత కొన్ని రోజులు పెళ్లి చేసుకోవాలని యువతి అడగడంతో తప్పించుకొని తిరుగుతున్నాడు. ప్రేమ పెళ్లికి అతడు నిరాకరించడంతో పాటు మరో అమ్మాయితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు పావనికి అనుమానం కలిగింది.సోమవారం తాతాజీ తన బైక్‌పై పంగడికి వచ్చాడు. ఆమె కూడా పంగడి వచ్చి అతడిని కలుసుకుంది. ఇదరు కలిసి బైక్ తిరిగారు. ఆమెను మలకపల్లి దించడానికి బైక్‌పై వెళ్తుండగా వెనుక కూర్చున్న ఆమె కత్తి తీసి వీపులో పొడిచింది. బైక్‌పై నుంచి ఇద్దరు పడిపోవడంతో మళ్లీ తల్ల, మెడపై పలుమార్లు పొడవడంతో తాతాజీ ఘటనా స్థలంలో చనిపోయాడు. వాహనదారులు గమనించిం పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.