శంషాబాద్ ఎయిర్‌పోర్టు…బాంబు బెదిరింపు

రంగారెడ్డి : శ‌ంషాబాద్ ఎయిర్‌పోర్టులోని డిక్యాతలాన్ స్పోర్ట్స్ స్టోర్ రూమ్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింది. స్టోర్‌లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియ‌ని అగంత‌కుడు ఫోన్ చేయ‌డంతో సిబ్బంది తీవ్ర భ‌యభ్రాంతుల‌కు గుర‌య్యారు. కోటి రూపాయాలు ఇవ్వాల‌ని, లేని ప‌క్షంలో రిమోట్‌తో బాంబును పేల్చేస్తామ‌ని అగంత‌కుడు బెదిరించాడు. అప్ర‌మ‌త్త‌మైన స్టోర్ యాజ‌మాన్యం.. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఉద్యోగుల‌ను, క‌స్ట‌మ‌ర్ల‌ను బ‌య‌ట‌కు పంపారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. బాంబు స్క్వాడ్‌తో త‌నిఖీలు చేప‌ట్టారు. విస్తృత త‌నిఖీల త‌ర్వాత బాంబు లేద‌ని పోలీసులు తేల్చ‌డంతో స్టోర్ యాజ‌మాన్యం ఊపిరి పీల్చుకుంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టి, ఫోన్ కాల్ చేసిన పోకిరిని అరెస్టు చేశారు.