యువతిపై దాడి

విబేధాల కారణంగా యువతిపై దాడి చేసిన వ్యక్తిని బేరికె పోలీసులు అరెస్ట్‌ చేశారు. హోసూరు సమీపంలోని బేరికె అన్నానగర్‌కు చెందిన లావణ్య (19), అదే ప్రాంతానికి చెందిన బంధువు శివకుమార్‌ (29) మధ్య విభేదాలు ఉన్నాయి.

బుధవారం శివకుమార్‌ లావణ్యపై బ్లేడ్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బేరికె పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్‌ చేశారు.