హైదరాబాద్ : బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు ఏ1 నిందితురాలిగా పేర్కొన్నారు. టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిని ఏ2గా, అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ను ఏ3గా పేర్కొన్నారు. కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్ తానే చేయించినట్లు అఖిలప్రియ అంగీకరించినట్లు తెలిపారు. భార్గవరామ్, సుబ్బారెడ్డితో కలిసి కిడ్నాప్‌కు పాల్పడిందన్నారు. సాక్షులను ప్రభావితం చేస్తారని అదేవిధంగా దర్యాప్తు పురోగతిని మిగతా నిందితులకు చేరవేయకుండా అఖిలప్రియను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. భార్గవ్‌రామ్‌కు తరచుగా నేరాలకు పాల్పడే అలవాటు ఉందన్నారు. బాధిత కుటుంబంపై నిందితులు దాడులు చేసే ప్రమాదం ఉండటంతో అరెస్టు చేసినట్లు చెప్పారు. కర్రలతో కొట్టి దస్ర్తాలు, బ్యాంకు పత్రాలపై సంతకాలు చేయించినట్లు తెలిపారు. నగరంలోని హఫీజ్‌పేట్‌లో 25 ఎకరాల భూమిని బోయిన్‌పల్లికి చెందిన వ్యాపారి ప్రవీణ్ కొనుగోలు చేశారు. ఈ భూమి విషయంలో సమస్యలు రావడంతో భూమా నాగిరెడ్డికి దగ్గరగా ఉండే ఏవీ సుబ్బారెడ్డి మధ్యవర్తిత్వం వహించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య జరిగిన ఒప్పం దం మేరకు నడుచుకోకపోవడంతో సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో ఆ స్థలం విషయంలో ఆయన కుమార్తె అఖిలప్రియ జోక్యం చేసుకొన్నారు. ఈ క్రమంలో కిడ్నాప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
