పెద్దపల్లి జిల్లాలో విషాదం

పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న కూతుళ్లను చూసేందుకు వెళ్తున్న మహిళ రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. పెద్దపల్లి ఎస్‌ఐ రాజేశ్‌ కథనం ప్రకారం.. కమాన్‌పూర్‌ మండలంలోని రొంపికంట గ్రామానికి చెందిన కొయ్యెడ రజిత-రవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరు ప్రస్తుతం కరీంనగర్‌లోని హాస్టల్‌లో ఉండి చదుకుంటున్నారు. ఆదివారం కావడంతో కూతుళ్లను చూసేందుకు రవి, రజిత దంపతులు బైక్‌పై కరీంనగర్ బయలుదేశారు.

పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వల సమీపంలో ఎదురుగా మరో బైక్‌ అడ్డురావడంతో రవి ఆకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో రజిత అదుపుతప్పి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పెద్దపల్లిలో చికిత్స అనంతరం ఆమెను మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయింది. రజిత సోదరుడు బైండ్ల రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.