హైదరాబాద్ : పంజాగుట్టలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్‌చల్ సృష్టించాడు. అక్కడున్న ట్రాఫిక్ పోలీసు బూత్‌పైకి ఎక్కిన ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో కింద ఉన్న పోలీసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అంతలోపే అక్కడున్న వైర్ సహాయంతో అతను ఆర్టీసీ బస్సుపైకి దూకేశాడు. అప్రమత్తమైన పోలీసులు ఆర్టీసీ బస్సుపైకెక్కి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కిందకు దూకే క్రమంలో అతని కాలికి స్వల్ప గాయమైంది. సమయానికి అటు నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లకపోయి ఉంటే ఆ వ్యక్తి ప్రాణాలకు ముప్పు ఉండేది. మొత్తానికి అతను స్వల్ప గాయాలతో బయటపడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చికిత్స నిమిత్తం ఆ వ్యక్తిని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం సరిగా లేకనే ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Source from:ntnews.com