మైన‌ర్‌ బాలికపై 17 మంది లైంగిక‌దాడి

బెంగ‌ళూరు : ఓ మైన‌ర్‌పై ఐదు నెల‌ల కాలంలో 17 మంది లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని చిక్క‌మగ‌ళూరు జిల్లాలో వెలుగు చూసింది. 15 ఏండ్ల బాలిక త‌ల్లి మూడేండ్ల క్రితం చనిపోయింది. దీంతో ఆ అమ్మాయి త‌న బంధువుల ఇంట్లో ఉంటూ.. స్టోన్ క్ర‌షింగ్ యూనిట్‌లో ప‌ని చేస్తోంది. అక్క‌డ ప‌ని చేసే డ్రైవ‌ర్ గిరీష్ మాయ‌మాట‌లు చెప్పి ఆమెపై లైంగిక‌దాడి చేశాడు. ఆ త‌ర్వాత బాలిక ఫోన్‌నంబ‌ర్‌ను త‌న స్నేహితుడైన అభికి ఇచ్చాడు. అత‌ను కూడా అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. బాలిక న‌గ్నంగా ఉన్న ఫోటోల‌ను అభి చిత్రీక‌రించి బ్లాక్ మెయిల్ చేశాడు. అలా ఆ ఫోటోల‌ను అడ్డుగా పెట్టుకుని ఐదు నెల‌ల కాలంలో 17 మంది అత్యాచారం చేశారు.ఈ విష‌యం జిల్లా శిశు సంక్షేమ క‌మిటీ చైర్మ‌న్ దృష్టికి వెళ్లింది. దీంతో చైర్మ‌న్ శృంగేరి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టి.. బాలిక‌పై లైంగిక‌దాడికి 8 మందిని అరెస్టు చేశారు. మిగ‌తా వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే ఈ కేసులో బాలిక బంధువును కూడా అదుపులోకి తీసుకున్నారు.