టిప్పర్ బీభత్సం

అబ్దుల్లాపూర్ మెట్‌ మండలం బాటసింగారం కూడలి వద్ద టిప్పర్ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెల్ కావడంతో అదుపు తప్పి పక్కనే ఆగి ఉన్నా ఆటోలపైకి దూసుకెళ్లిన టిప్పర్‌ బోల్తాపడటంతో రెండు ఆటోలు ధ్వంసం అయ్యాయి.

ఈ ప్రమాదంలో ఒక్కరికి తీవ్ర గాయాలు కాగా పక్కనే ఉన్న అయిదుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 సహాయంతో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.