ఆటలో భాగంగా అమ్మాయి బట్టలు విప్పింది…తర్వాత షాక్

ముంబై : సోష‌ల్ మీడియాలో మీరు గేమ్స్ ఆడుతున్నారా? అయితే జాగ్ర‌త్త ప‌డాల్సిందే. లేదంటే మీ భ‌విష్య‌త్‌కు భంగం వాటిల్ల‌క త‌ప్ప‌దు.. అందులోనూ ‘ట్రూత్ ఆర్ డేర్’ గేమ్ ఆడేట‌ప్పుడు అమ్మాయిలూ చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేక‌పోతే మిమ్మ‌ల్ని బ్లాక్‌మెయిల్ చేసే అవ‌కాశ‌ముంది.

ముంబైకి చెందిన ఓ 13 సంవ‌త్స‌రాల బాలుడు.. త‌న స్కూల్‌మేట్ అయిన ఓ విద్యార్థిని(14)కి ఇన్‌స్టాగ్రామ్‌లో రెక్వెస్ట్ పంపాడు. అయితే గుర్తు తెలియ‌ని ఫోటో, ప్రొఫైల్‌తో ఆ విద్యార్థినికి రెక్వెస్ట్ పంప‌గా ఆమె అంగీక‌రించింది. కొద్ది రోజుల‌కు వీరిద్ద‌రి మ‌ధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్ప‌డింది. దీంతో ఇద్ద‌రూ క‌లిసి ‘ట్రూత్ ఆర్ డేర్’ గేమ్ ఆడ‌టం మొద‌లు పెట్టారు. ఒక‌రోజు గేమ్‌లో భాగంగా డేర్ చేయాల‌ని ఆ అమ్మాయికి అబ్బాయి సందేశం పంపాడు. దుస్తులు విప్పాల‌ని ఆదేశించ‌డంతో గేమ్ ప‌రంగా ఆమె దుస్తులు విప్పేసింది. ఇదంతా లైవ్‌లోనే జ‌రుగుతుంది. దీంతో అత‌ను ఆమెకు తెలియ‌కుండా త‌న ఫోన్‌లో రికార్డు చేశాడు. మ‌ళ్లీ మ‌ళ్లీ బ‌ట్ట‌లు విప్పాల‌ని విద్యార్థినికి ఆ యువ‌కుడు గేమ్ ఛాలెంజ్ చేశాడు. దుస్తులు విప్ప‌క‌పోతే వీడియోలు వైర‌ల్ చేస్తాన‌ని ఆమెను బెదిరించాడు. మొద‌టిసారి దుస్తులు విప్పిన వీడియోను ఆమెకు పంపి బ్లాక్ మెయిల్ చేయ‌డం మొద‌లెట్టాడు. దీంతో విసుగెత్తిపోయిన ఆ యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

విద్యార్థినితో పాటు అత‌ని కుటుంబ స‌భ్యులు షాక్‌

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఐపీ అడ్ర‌స్ ఆధారంగా బ్లాక్ మెయిల్‌కు పాల్ప‌డుతున్న యువ‌కుడిని పోలీసులు గుర్తించారు. త‌న స్కూల్‌మేట్ అని తెలియ‌డంతో విద్యార్థిని షాక్‌కు గురైంది. ఆ యువ‌కుడి త‌ల్లిదండ్రులు కూడా ఖంగుతిన్నారు. విద్యార్థి త‌ల్లిదండ్రులిద్ద‌రూ ఉన్న‌త విద్యావంతులు. త‌మ పిల్లాడు మొబైల్‌లో ఇలాంటి పాడుప‌నులు చేస్తాడ‌ని ఊహించ‌లేద‌ని పేర్కొన్నారు.