రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌కు చెందిన క్యాప్‌ను అందుకున్న శ్రీశాంత్

కోచి: ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఏడేండ్ల నిషేధాన్ని పూర్తి చేసుకున్న టీమ్‌ఇండియా పేసర్‌ ఎస్‌ శ్రీశాంత్‌ మళ్లీ దేశవాళీ క్రికెట్లో బరిలో దిగనున్నాడు.  జనవరి 10న ముస్తాక్‌ అలీ టోర్నీ ఆరంభంకానుండగా టోర్నీ కోసం ప్రకటించిన కేరళ ప్రాబబుల్స్‌లో శ్రీశాంత్‌కు చోటు దక్కింది. కేరళ జట్టుకు సంజు శాంసన్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలోనే శ్రీశాంత్‌ తన సహచరుల సమక్షంలో రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌కు చెందిన క్యాప్‌ను అందుకున్నాడు. క్రికెట్‌ సంఘం సభ్యులు, అధికారులకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చిన శ్రీశాంత్‌కు అందరూ చప్పట్లతో టీమ్‌లోకి ఆహ్వానించారు.